పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన

దిశ, భువనగిరి: గొర్రెల మేకల పెంపకం దారుల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం యాదాద్రి జిల్లా కేంద్రంలోని భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొండమడుగు నర్శింహ్మ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నర్సింహా మాట్లాడుతూ… గత రెండేండ్లుగా లక్షలాది రూపాయల డీడీలు కట్టి, రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే గొర్రెల మేకలపెంపకం దారుల […]

Update: 2020-09-21 01:56 GMT

దిశ, భువనగిరి: గొర్రెల మేకల పెంపకం దారుల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం యాదాద్రి జిల్లా కేంద్రంలోని భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొండమడుగు నర్శింహ్మ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నర్సింహా మాట్లాడుతూ… గత రెండేండ్లుగా లక్షలాది రూపాయల డీడీలు కట్టి, రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే గొర్రెల మేకలపెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ ఛలో ప్రగతి భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిందని తెలిపారు. కాగా సోమవారం ముట్టడికి వెళ్తారేమో అని ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.

Tags:    

Similar News