కేటీఆర్ సిరిసిల్ల పర్యటన.. పోలీసుల ఓవరాక్షన్ (వీడియో)

దిశ ప్రతినిధి, కరీంనగర్ : నా గోడు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వారా.? నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోనివ్వరా.? రోడ్ల పక్కన నిలబడ్డ వాళ్లను చూసి ఆగి మరీ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. నా సమస్య కూడా అలాగే పరిష్కారం అవుతుందని భావిస్తున్నానంటూ నేరెళ్ల బాధితుడు కోల హరీష్ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో హరీష్ తన ఇంటి వద్ద ప్లకార్డులు ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. అప్పటికే హరీష్ ఇంటి […]

Update: 2021-07-30 03:05 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : నా గోడు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వారా.? నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోనివ్వరా.? రోడ్ల పక్కన నిలబడ్డ వాళ్లను చూసి ఆగి మరీ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. నా సమస్య కూడా అలాగే పరిష్కారం అవుతుందని భావిస్తున్నానంటూ నేరెళ్ల బాధితుడు కోల హరీష్ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

శుక్రవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో హరీష్ తన ఇంటి వద్ద ప్లకార్డులు ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. అప్పటికే హరీష్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు అతన్ని వారించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఐదేళ్లుగా తన సమస్యను పరిష్కరించలేదని, తనకు న్యాయం జరగలేదంటూ కోల హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అతన్ని సముదాయించే ప్రయత్నం పోలీసులు చేయగా ఇప్పటికి ఎంతోమంది పోలీసు అధికారులు తన ఇంటికి వచ్చి మాట ఇచ్చి వెళ్లిపోయారు. ఏ ఒక్కరూ చొరవ తీసుకోలేదని ఆరోపించారు. రోడ్డు పక్కన ప్లకార్డు పట్టుకుని నిలబడితే తనను చూసి కేటీఆర్ ఆగి సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. చివరకు సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు కూడా తనను అడ్డుకున్నారని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News