తెలంగాణ మెరుగ్గా ఉంది: కేంద్ర ఆర్థిక మంత్రి

పన్ను వసూళ్లు, ఆర్థిక వృద్ధిలో తెలంగాణ మెరుగ్గా ఉందనీ, దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున సహకరిస్తున్నదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. హైదరాబాద్‌లో ట్రేడ్ ఇండస్ట్రీ వర్గాల ఎకనామిస్ట్‌లు, పాలసీ మేకర్‌లతో నిర్మల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడ్జెట్‌పై వ్యాపార వర్గాల నుంచి అభిప్రాయ సేకరణలో భాగంగా అన్ని ప్రముఖ నగరాల్లోని వ్యాపారవేత్తలతో చర్చిస్తున్నామని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ స్పందన తన దృష్టికి వచ్చిందని తెలిపారు. పన్నుల్లో రాష్ట్రాల […]

Update: 2020-02-16 06:50 GMT

పన్ను వసూళ్లు, ఆర్థిక వృద్ధిలో తెలంగాణ మెరుగ్గా ఉందనీ, దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున సహకరిస్తున్నదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. హైదరాబాద్‌లో ట్రేడ్ ఇండస్ట్రీ వర్గాల ఎకనామిస్ట్‌లు, పాలసీ మేకర్‌లతో నిర్మల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడ్జెట్‌పై వ్యాపార వర్గాల నుంచి అభిప్రాయ సేకరణలో భాగంగా అన్ని ప్రముఖ నగరాల్లోని వ్యాపారవేత్తలతో చర్చిస్తున్నామని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ స్పందన తన దృష్టికి వచ్చిందని తెలిపారు. పన్నుల్లో రాష్ట్రాల వాటా 42నుంచి 41శాతానికి తగ్గించడం పూర్తిగా తమ నిర్ణయం కాదనీ, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారమే నడుచుకున్నామని వెల్లడించారు. పన్ను వసూళ్లలో మెరుగ్గా ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనడం అవాస్తవమని అన్నారు. అన్ని రాష్ట్రాలతో సామరస్యంగా ఉండటమే ఎన్డీయే ప్రభుత్వ విధానమని వెల్లడించారు.

Tags:    

Similar News