లగ్జరీ కారు కొన్న మిస్టర్ షన్ను.. ‘నంబర్ బోర్డ్ బ్లర్ హై’ అంటూ ట్రోలింగ్
దిశ, సినిమా : ‘అరే ఏంట్రా ఇది’ డైలాగ్‌తో ఫేమ్ సంపాదించుకున్న షణ్ముఖ్ జశ్వంత్.. పలు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూత్‌లో మంచి గుర్తింపు సంపాదించాడు. లాక్డౌన్లో వచ్చిన ‘సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య’ సిరీస్‌లు తెలుగు రాష్ట్రాల్లో తనను స్టార్‌ను చేశాయి. ప్రజెంట్ ‘సూర్య’ సక్సెస్ సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉన్న షణ్ముఖ్.. బిగ్ స్క్రీన్ హీరోకున్న ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో రూ. 15 లక్షలతో కొత్త లగ్జరీ కారు కొన్నట్లు అందుకు సంబంధించిన పిక్స్ షేర్ […]
దిశ, సినిమా : ‘అరే ఏంట్రా ఇది’ డైలాగ్‌తో ఫేమ్ సంపాదించుకున్న షణ్ముఖ్ జశ్వంత్.. పలు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూత్‌లో మంచి గుర్తింపు సంపాదించాడు. లాక్డౌన్లో వచ్చిన ‘సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య’ సిరీస్‌లు తెలుగు రాష్ట్రాల్లో తనను స్టార్‌ను చేశాయి. ప్రజెంట్ ‘సూర్య’ సక్సెస్ సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉన్న షణ్ముఖ్.. బిగ్ స్క్రీన్ హీరోకున్న ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో రూ. 15 లక్షలతో కొత్త లగ్జరీ కారు కొన్నట్లు అందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేశాడు.
“ఇది నేను హై.. ఇది నా కొత్త కారు హై.. పార్టీలు లేవు హై.. త్వరలో డ్రైవర్‌ను కూడా పెట్టుకుంటున్నా హై” అంటూ ఈ విషయాన్ని అభిమానులకు తెలిపాడు. అయితే ఫొటోల్లో నంబర్ ప్లేట్ కనిపించకుండా కవర్ చేయడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య మద్యం సేవించి కారు నడిపిన షణ్ముఖ్.. పోలీసులు, కేసు అంటూ రెండు మూడు రోజులు వార్తల్లో నిలిచాడు. దీంతో “మళ్లీ మందు తాగి కారు నడిపేవు.. కోర్టు, కేసులు, చలాన్లు అంటూ తిరగాల్సి వస్తుంది.. జర జాగ్రత్త” అని హెచ్చరిస్తున్నారు.