రాజకీయాల్లోకి స్టార్ హీరోయిన్ జ్యోతిక.. ఎట్టకేలకు క్లారిటీ ఇస్తూ ఆసక్తికర కామెంట్స్!

స్టార్ హీరోయిన్ జ్యోతిక కోలివుడ్ హీరో సూర్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-04 10:54 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ జ్యోతిక కోలివుడ్ హీరో సూర్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. జ్యోతిక, సూర్య విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది కాలంగా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో జ్యోతిక స్పందించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం జ్యోతిక, సూర్య వరుస సినిమాలు చేస్తూనే స్టార్ కపుల్‌గా ప్రేక్షకుల్లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే జ్యోతిక ఇటీవల హిందీలో సైతాన్ చిత్రంతో హిట్ అందుకుంది. అదే ఫామ్‌లో ఇప్పుడు అంధుడైన పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్ల బయోపిక్‌లో జ్యోతిక కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా మే 10న విడుదల కాబోతుంది.

ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న జ్యోతిక రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. ‘‘ నాకు బాగా నచ్చిన చిత్రం శ్రీకాంత్. ఇది నా కెరీర్ చాలా ముఖ్యమైనదిగా నిలిచిపోవాలని అనుకుంటున్నాను. శ్రీకాంత్ మూవీలో నేను భాగం కావడం సంతోషంగా అనిపిస్తుంది. అయితే అందరూ సూర్యతో ఎప్పుడు నటిస్తావని అడుగుతున్నారు. మంచి కథ కోసం చూస్తున్నాను. అవకాశం వచ్చి మంచి స్టోరి వస్తే కచ్చితంగా నటిస్తాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇక యాంకర్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అని అడగ్గా.. దానికి జ్యోతిక స్పందిస్తూ.. నిజం చెప్పాలంటే నన్ను ఎవ్వరూ రాజకీయాల్లోకి ఆహ్వానించలేదు. వారు పిలిచినా కానీ నాకు ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏం లేవు. కాబట్టి రాజకీయాల్లో రావాలనుకోవడం లేదు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Similar News