ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయింది....

Update: 2024-05-04 10:58 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం ఓపీఓలకు పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 6న జర్నలిస్టులు, ఎమర్జెన్సీ ఉద్యోగులకు అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 8 వరకూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అధికారులు అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు హోంఓటింగ్‌కు కల్పించనున్నారు.

మరోవైపు ఏలూరు జిల్లాలో ఇప్పటికే ఎన్నికల హడావుడి నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు ఓటింగ్ సదుపాయం కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకూ 5 ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అత్యవసర సేవల సిబ్బందికి ఈ సదుపాయం కల్పించారు. ఆదివారం, సోమవారం ఆయా నియోజకవర్గా ఫెలిలిటేషన్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

Read More..

గాజువాక నుంచి తప్పుకుంటా.. మంత్రి అమర్‌నాథ్ సంచలన నిర్ణయం 


Similar News