పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయండి.. మాచర్ల టీడీపీ అభ్యర్థి డిమాండ్

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు...

Update: 2024-05-22 16:47 GMT

దిశ, వెబ్ డెస్క్: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా పాల్వాయి గేట్ వద్ద పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన రామకృష్ణారెడ్డి.. ఆగ్రహంతో ఈవీఎం మిషన్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఏపీ డీజీపీకి బ్రహ్మానందరెడ్డి ఫిర్యాదు చేశారు. వెంటనే పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలని కోరారు. పాల్పాయి గేటు ఘటనలో పూర్తి బాధ్యత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదేనన్నారు. ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేయించారని ఆరోపించారు. పోలింగ్ కు ముందు, తర్వాత జిల్లాలో చోటు చేసుకున్న అన్ని ఘటనల వెనుక పిన్నెల్లి హస్తం ఉందని బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. దాడులు చేస్తామని పిన్నెల్లి ముందే చెప్పాడన్నారు. ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిన పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలని బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. 

Similar News