Breaking: ఏసీబీ వలలో కాకినాడ జిల్లా ప్రభుత్వ అధికారి

కాకినాడ జిల్లాలో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు...

Update: 2024-05-22 16:14 GMT

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం మురళి రూ. 2 లక్షలు తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కగా స్కెచ్ వేసి మురళిని పట్టుకున్నారు. శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు నిస్వార్థంగా ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా లంచం అడిగితే సమాచారం అందించారని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు. 

Similar News