చిత్తూరు గంగమ్మ జాతర.. ఒళ్లు గగుర్పొడిచేలా భక్తుల విన్యాసాలు

చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది....

Update: 2024-05-22 15:52 GMT

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. మంగళవారం మొదలైన జాతర వంశపారంపర్య ధర్మకర్త కటుంబ, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి సైతం భక్తులు భారీ తరలిస్తు్న్నారు. వివిధ వేషదారణలో మొక్కులు తీర్చుకుంటున్నారు. బుధవారం అమ్మవారి నిమజ్జనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓం శక్తి భక్తుల విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచాయి. 11 రోజులు ఉపవాసం ఉన్న ఓం శక్తి భక్తులు నోటికి, ఒంటికి శూలాలు, కొక్కేలను గుచ్చుకొన్నారు. శివాలయం నుంచి గంగమ్మ గుడి వరకు వచ్చి క్రేన్ ద్వారా అమ్మవారికి పూలమాలను వేశారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పున్నెమ్మ గుడి నుంచి సారెను తీసుకెళ్లి గంగమ్మకు పూజలు చేసి నిమజ్జనాన్ని కొనసాగించారు. 

Similar News