‘పార్టీ లేదా పుష్ప’ : జొమాటో నొటిఫికేషన్స్పై నెటిజన్స్ ఇరిటేషన్
దిశ, సినిమా : జొమాటో మామూలు ఫామ్‌లో లేదు. ప్రతీ సినిమాను, డైలాగ్‌ను వాడుతూ కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ట్రై చేస్తుంది. కానీ ఈ ప్రయత్నం బెడిసికొడితే ఏం జరుగుతుందో తెలుసుగా.. కామెంట్ల వర్షం, మీమ్స్ జడివానలో కొట్టుకుపోతారు. ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది జొమాటో. ‘పార్టీ లేదా పుష్ప? .. అనే బదులు జొమాటోలో ఆర్డర్ చెయ్యిరా చిట్టి నాయుడు’ అంటూ తాజాగా తెలుగు ప్రేక్షకులకు ఓ నోటిఫికేషన్ ఇచ్చింది జొమాటో. అయితే దీని పై ఫైర్ […]
దిశ, సినిమా : జొమాటో మామూలు ఫామ్‌లో లేదు. ప్రతీ సినిమాను, డైలాగ్‌ను వాడుతూ కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ట్రై చేస్తుంది. కానీ ఈ ప్రయత్నం బెడిసికొడితే ఏం జరుగుతుందో తెలుసుగా.. కామెంట్ల వర్షం, మీమ్స్ జడివానలో కొట్టుకుపోతారు. ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది జొమాటో. ‘పార్టీ లేదా పుష్ప? .. అనే బదులు జొమాటోలో ఆర్డర్ చెయ్యిరా చిట్టి నాయుడు’ అంటూ తాజాగా తెలుగు ప్రేక్షకులకు ఓ నోటిఫికేషన్ ఇచ్చింది జొమాటో. అయితే దీని పై ఫైర్ అవుతున్న నెటిజన్లు… ‘టైమ్ కాని టైమ్‌లో నోటిఫికేషన్లు ఇచ్చి బాగా ఇరిటేట్ చేస్తున్నడు భయ్యా ’ అంటూ మండిపడుతున్నారు. దీంతో నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోండి భయ్యా అంటూ సజెషన్స్ ఇస్తున్నారు మిగతా నెటిజన్లు.