నిర్మల్ జిల్లా విద్యార్థులకు ఆదిలాబాద్ జిల్లాలో పరీక్షలు

సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలకు సంబంధించి పరీక్షల విభాగం యంత్రాంగం అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని ప్రైవేటు కళాశాలల మేనేజ్మెంట్ లకు సహకరిస్తున్నారన్న ఆరోపనలు వ్యక్తం అవుతున్నాయి.

Update: 2024-05-04 08:00 GMT

దిశ ప్రతినిధి నిర్మల్: సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలకు సంబంధించి పరీక్షల విభాగం యంత్రాంగం అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని ప్రైవేటు కళాశాలల మేనేజ్మెంట్ లకు సహకరిస్తున్నారన్న ఆరోపనలు వ్యక్తం అవుతున్నాయి. నిర్మల్ జిల్లా విద్యార్థులకు ఆదిలాబాద్ జిల్లాలో పరీక్షలు రాసినందుకు సెంటర్ కేటాయించడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీన్ని విద్యార్థులు కూడా తప్పుపడుతున్నారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్ పూర్ మండలంలో ఉన్న ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాల, సారంగాపూర్ మండలంలోని మరొక డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రైవేటు డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. వాస్తవానికి ఈ రెండు మండలాలకు చెందిన విద్యార్థులకు నిర్మల్ జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి కానీ ఎందుకు భిన్నంగా నిర్మల్ జిల్లాను వదిలేసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 80 కిలోమీటర్ల దూరంలోని డిగ్రీ కళాశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

భారీ ఎండలు ఉన్న ఈ సీజన్ లో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ ను కాదని ఆదిలాబాద్ జిల్లాలోని 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోథ్ కేంద్రంలో పరీక్షల సెంటర్ కేటాయించడంపై కాకతీయ యూనివర్సిటీ అధికారులకు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి కొంతమంది ప్రైవేట్ కళాశాలలో యాజమాన్యాలు మేనేజ్ చేసి మారుమూల కేంద్రంలో పరీక్ష కేంద్రం కేటాయించుకునేలా చేశారని తెలుస్తున్నది ఇది మాస్ కాపీయింగ్ అనుకూలంగా ఉంటుందని ఈ కారణంగానే విద్యార్థులకు దూరం అయినా సరే... పరీక్ష కేంద్రం కేటాయించడంలో అవకతవకలు జరిగాయని ఇతర ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. తక్షణమే నిర్మల్ జిల్లా విద్యార్థులకు నిర్మల్ జిల్లాలోనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాగా డిగ్రీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Similar News