పాక్‌కు చేతకాకపోతే మేం సహకరిస్తాం.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు

ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడానికి పాక్‌కు చేతకాకపోతే..వారికి సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.

Update: 2024-04-11 09:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడానికి పాక్‌కు చేతకాకపోతే..వారికి సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ ఉగ్రవాదాన్ని ఉపయోగించి భారత్‌ను అణచివేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రం దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గురువారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే శక్తి పాకిస్థాన్‌కు లేదని వారు భావిస్తే..భారత్ సాయం తీసుకోవచ్చని సూచించారు. భారత్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తే, మేము పాకిస్థాన్‌లోకి ప్రవేశించి వారిపై దాడి చేస్తామని చెప్పారు. కానీ భారత్ ఇప్పటి వరకు ఏ దేశంపైనా దాడి చేయలేదని వెల్లడించారు. ఇతర దేశాల భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదన్నారు. అయితే భారత్‌కు నష్టం చేకూర్చాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.  

Tags:    

Similar News