అస్సాం టీ ఎస్టేట్‌లో అతిసార వ్యాధితో 11 మంది మృతి

టిన్సుకియా జిల్లాలోని ఓ టీ ఎస్టేట్‌లో గడిచిన వారం రోజుల్లోనే డయేరియా కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-05-23 10:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అస్సాంలో అతిసారి వ్యాధి కారణంగా మరణాలు సంభవించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. టిన్సుకియా జిల్లాలోని ఓ టీ ఎస్టేట్‌లో గడిచిన వారం రోజుల్లోనే డయేరియా కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో అపరిశుభ్రత, సరైన తాగునీరు లేకపోవడంతో వారంతా చనిపోయారని తోటి కార్మికులు ఆరోపణలు చేస్తున్నారు. వారం వ్యవధిలోనే పదికి పైగా మరణాలు సంభవించడంపై అస్సాం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని అంచనా వేయాలని అస్సాం ప్రధాన కార్యదర్శి, టిన్సుకియా జిల్లా కమిషనర్‌ను ఆదేశించారు. ప్రభావితమైన ప్రజలకు తక్షణం సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అస్సాం ఎమ్మెల్యే రూపేష్ గోవాలా కూడా టీ ఎస్టేట్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వ్యాధి నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తగినంత పారిశుధ్యం, పరిశుభ్రత, త్రాగడానికి, వంట చేయడానికి, శుభ్రపరచడానికి సురక్షితమైన నీటి కొరత ఉన్నప్పుడు అతిసార వ్యాధి సంక్రమిస్తుంది. దీనిపై ఇప్పటికే అధికారులు స్థానికులకు సూచనలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. 

Tags:    

Similar News