ఆ విషయంలో రామ్ చరణ్‌తో పోటీపడుతున్న పాయల్ రాజ్‌పుత్.. మొత్తానికి సాధించింది..

‘RX100’తో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్.

Update: 2023-11-17 14:27 GMT

దిశ, సినిమా: ‘RX100’తో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. తాజాగా ఈ అమ్మడు ‘మంగళవారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ హిట్‌తో పాయల్‌కు పెద్ద సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కీలక పాత్ర కోసం సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్‌తోపాటు సమానమైన పాత్రలో మెస్మరైజ్ చేయబోతుందని టాక్ వినపడుతుంది.

ఈ క్యారెక్టర్‌ కొంచెం నెగిటివ్ టచ్‌తో ఉండబోతుందని.. అందుకే పాయల్ అయితే బాగుంటుందని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉండగా.. ఒకవేళ ఇది నిజం అయితే మాత్రం పాయల్ నక్కతోక తొక్కినట్లే అని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే చరణ్‌తో ఈ మూవీ క్లిక్ అయితే పాయల్ మరిన్ని ఆఫర్లతో దూసుకెళ్లడం ఖాయం.

Read More..

ఇష్టం లేకున్నా అలాంటి సీన్స్ చేస్తాను : Payal Rajput  

Tags:    

Similar News