ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. అల్లు అర్జున్‌‌తో వివాదం ముగిసినట్లేనా?.. మళ్లీ ఏం పెట్టారంటే?

ఇటీవల ఏపీ ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ తరపున ప్రచారంలో పాల్గొనకుండా తన స్నేహితుడి తరపున ప్రచారం చేసి సంగతి తెలిసిందే.

Update: 2024-05-18 08:07 GMT

దిశ, సినిమా: ఇటీవల ఏపీ ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ తరపున ప్రచారంలో పాల్గొనకుండా తన స్నేహితుడి తరపున ప్రచారం చేసి సంగతి తెలిసిందే. దీనిపై కేసు కూడా నమోదు అయింది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత నాగబాబు చేసిన ఒక్క పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టించింది. మావాడైనా పరాయివాడే.. పరాయి వాడైనా మా వాడే అని ట్విట్ చేశాడు. అయితే అల్లు అర్జున్ ప్రచారం చేయడం వల్లే ఆ పోస్ట్ పెట్టాడని అంతా చర్చించుకున్నారు. అలాగే ఈ ట్వీట్‌పై అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య పెద్ద వివాదామే మొదలైంది.

అల్లు రాజలింగయ్య లేకపోతే నాగబాబు ఉండేవాడు కాదు. సైకిళ్లకు పంచర్లు వేసుకునేవాడని అల్లు అర్జున్ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఓ పోస్ట్ రావడంతో వివాదం ముదిరింది. దీంతో నాగబాబును అల్లు అర్జున్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలో నాగబాబుకు ఏమైందో తెలియదు కానీ ట్విట్టర్ అకౌంట్‌ను డియాక్టీవేట్ చేశాడు. దీంతో అంతా ఈ గొడవ ఇంతటితో ముగిసిందని అనుకున్నారు.

తాజాగా.. నాగబాబు మళ్లీ ట్విట్టర్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా ఓ పోస్ట్ కూడా పెట్టి వివాదాన్ని కన్ఫమ్ చేసినట్లుగా పోస్ట్ పెట్టాడు. ‘‘నేను నా ట్వీట్‌ను డిలీట్ చేశాను’’ అని రాసుకొచ్చాడు. దీంతో అల్లు అర్జున్‌తో వివాదం వల్లే డిలీట్ చేశాడని ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఏదో జరుగుతుందని అంతా చర్చించుకుంటున్నారు. మరికొందరు భయపడ్డాడు అని అంటున్నారు.

Similar News