చందూ సూసైడ్ కేసులో కీలకం కానున్న వాట్సాప్ చాట్.. చివరిగా మెసేజ్ ఎవరికి చేశారు?

ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వీడియో ఏదైనా ఉన్నదా అంటే? పవిత్ర జయరాం, చందు సూసైడ్ కేసులే. చాలా తక్కువ సమయంలో తెలుగు బుల్లితెర ఇద్దరు ఆర్టిస్టుల్ని కోల్పోయింది. త్రినయని సీరియల్ ఫేమ్ పవిత్రా జయరామ్

Update: 2024-05-18 07:48 GMT

దిశ, సినిమా : ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వీడియో ఏదైనా ఉన్నదా అంటే? పవిత్ర జయరాం, చందు సూసైడ్ కేసులే. చాలా తక్కువ సమయంలో తెలుగు బుల్లితెర ఇద్దరు ఆర్టిస్టుల్ని కోల్పోయింది. త్రినయని సీరియల్ ఫేమ్ పవిత్రా జయరామ్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తర్వాత ఆమెతో చాలా సన్నిహితంగా ఉంటూ తానే ప్రాణంగా మెదిలిన చందూ సూసైడ్ చేసుకొని చనిపోయారు. దీంతో టాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. అసలు చందూ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు. పవిత్ర మీద ప్రేమతోనేనా? ఇంకేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన వాట్సాప్ చాట్ కీలకం కానున్నట్లు తెలుస్తోంది. తాను పవిత్ర జయరామ్ మరణం తర్వాత కాస్త డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తన పోస్టులు చూస్తే అర్థం అవుతుంది.అయితే ఆయన ఆత్మహత్య‌కు ముందు ఎవరితో చాట్ చేశారు. సన్నిహితులకు ఏమైనా చెప్పారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టనున్నారంట. అలాగే చందు చివరగా ఎవరికి మెసేజ్ చేశారో ఆయనను కూడా పోలీసులు విచారించనున్నారని సమాచారం.

ఇక త్రినయని' సీరియల్ పవిత్రా జయరామ్, చంద్రకాంత్ భార్యాభర్తలుగా నటించారు. వారి కెమిస్ట్రీని చూసి వారు నిజంగా పెళ్లి చేసుకున్నారని అందరూ నమ్మారు కానీ వారు చాలా సంవత్సరాలుగా సహజీవంనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పవిత్రే తన జీవితమని భావించినట్టు చందు చెప్పిన మాటలు, ఆయన చివరి ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Similar News