భోళాశంకరుడి ఆశీస్సులు రాష్ట్రప్రజలపై ఉండాలి: బాలకృష్ణ

‘హరహర మహాదేవ శంభోశంకర’ అంటూ యావత్ ప్రపంచమంతా శివనామ స్మరణతో మార్మోగే ఈ మహాశివరాత్రి పర్వదినం

Update: 2023-02-18 06:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: 'హరహర మహాదేవ శంభోశంకర' అంటూ యావత్ ప్రపంచమంతా శివనామ స్మరణతో మార్మోగే ఈ మహాశివరాత్రి పర్వదినం రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపాలి అని అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. జీవకోటి రాసుల సృష్టికర్తగా పిలువబడే శివనాథుని ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని వేడుకున్నారు. భూతనాధుడైన ఆ శంకరుడు రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తుల నుండి విడిపించి.. మనశ్శాంతిని, సుఖశాంతులను ప్రసాదించాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. భోళాశంకరుడు తన మెండైన దీవెనలతో ఈ దేశ ప్రజలను అష్టైశ్వర్యాలతో దీవించాలని ప్రార్థిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News