కేన్స్‌లో సత్తా చాటిన మహిళలు.. ప్రశంసలు కురిపించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ!

ఫ్రాన్స్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారతీయ మహిళలు సత్తాచాటిన విషయం తెలిసిందే.

Update: 2024-05-26 09:51 GMT

దిశ, సినిమా: ఫ్రాన్స్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారతీయ మహిళలు సత్తాచాటిన విషయం తెలిసిందే. ఈ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో మలయాళీ చిత్రం 'ఆల్‌ వీ ఇమాజైన్‌ యాజ్‌ లైట్‌' ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకోగా.. భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా ఉత్తమ నటిగా అవార్డు అందుకుని కేన్స్‌లో ఈ అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించింది. అయితే ఈ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో భారతీయ మహిళలు సత్తా చాటడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వీరిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

”77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన భారతీయ తారలు. ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకున్నందుకు పాయల్ కపాడియాకు అలాగే ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ టీమ్ మొత్తానికి అభినందనలు. 'ది షేమ్‌లెస్‌' అనే చిత్రంలో నటనకు గాను 'అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌' కేటగిరీలో ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న అనసూయ సేన్‌గుప్తాకు అభినందనలు. ఈ మహిళలు చరిత్ర లిఖించి మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమకి ఆదర్శంగా నిలుస్తున్నారు”. అంటూ రాహుల్ గాంధీ రాసుకొచ్చాడు. ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Similar News