ఎన్టీఆర్‌పై విరాట్ కోహ్లీ ప్రశంసలు.. వర్ణించడానికి మాటలు సరిపోవంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2024-05-26 10:13 GMT

దిశ, సినిమా: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఏమన్నారంటే.. ‘‘ తారక్ నాకు మంచి ఫ్రెండ్. మేమిద్దరం ఓ యాడ్ షూట్‌లో నటించే సమయంలో కలిసినప్పుడు అతని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాను. ఆ తర్వాత అతను నటించి ఆర్ఆర్ఆర్ సినిమా చూశాక తారక్ నటన వర్ణించడానికి మాటలు సరిపోవు అనిపించింది.

ముఖ్యంగా అందులోని నాటు నాటు పాటకు ఆయన వేసిన డాన్స్ ఎంతో మందిని ఆకట్టుకుంది. దీంతో నేను నా భార్య అనుష్కతో కలిసి ఈ పాటకు రీల్ చేశాను. ఆ తర్వాత ఈ పాటకు ఆస్కార్ వచ్చిందని తెలిసి గ్రౌండ్‌లోనే డాన్స్ చేశాను. తారక్‌తో మరోసారి నటించడానికి రెడీగా ఉన్నాను’’ అంటూ ప్రశంసలు కురిపించాడు.

Similar News