కొత్త సినిమా ప్రకటించిన కార్తీ.. అదిరిన ‘వా వాతియార్’ ఫస్ట్ లుక్

కోలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ సూర్య తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే తెలుగులోనూ పలు సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించి హీరోగా రాణిస్తున్నాడు.

Update: 2024-05-26 09:45 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ సూర్య తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే తెలుగులోనూ పలు సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించి హీరోగా రాణిస్తున్నాడు. కార్తీక్ ఇటీవల జపాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ‘మెయ్యళగన్’ మూవీ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా, కార్తీ మరో కొత్త సినిమా ప్రకటించి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు.

‘వవతియార్’ టైటిల్‌లో రాబోతున్న ఈ చిత్రానికి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కార్తీ సరసన కీర్తి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. అయితే మేకర్స్ వావతియార్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కార్తీ పోలిస్ డ్రెస్ ధరించి స్టైలిష్ లుక్‌తో అందరిని మైమరిపిస్తున్నాడు.

Similar News