తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. క్లారిటీ ఇచ్చిన నాగశౌర్య
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తనకు కాబోయే భార్య లక్షణాల గురించి ఓపెన్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా సెప్టెంబర్ 23న విడుదలకాబోతుంది.
దిశ, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తనకు కాబోయే భార్య లక్షణాల గురించి ఓపెన్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన నటించిన 'కృష్ణ వ్రింద విహారి' సినిమా సెప్టెంబర్ 23న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా ఓ సమావేశంలో పాల్గొన్న హీరోను పెళ్లి ఎప్పుడూ చేసుకుంటారు? ఎలాంటి అమ్మాయి కావాలి? డేటింగ్లో ఉన్నారా? తెలుగమ్మాయేనా? అని విలేఖర్లు ప్రశ్నించగా కూల్‌గా సమాధానం చెప్పాడు.
ఈ మేరకు ప్రస్తుతం ఎవరితో డేటింగ్లో లేనని, మ్యారేజ్ గురించి కూడా ఇప్పట్లో ఆలోచించట్లేదన్న ఆయన.. తనకు కాబోయే భార్య మాత్రం సంప్రదాయంగా ఉండాలని చెబుతూ తెలుగమ్మాయే అనే విషయంపై హింట్ ఇచ్చాడు. దీంతో నాగశౌర్య తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ చర్చ మొదలుపెట్టిన నెటిజన్లు.. ఆ లక్కీ గర్ల్ ఎవరోనని నెట్టింట సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఇక డైరెక్టర్ అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షిర్లీ సేఠియా హీరోయిన్గా నటిస్తుండగా.. ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.