పవన్ కల్యాణ్‌కు మద్దతుగా టాలీవుడ్ స్టార్ హీరోలు.. వరుస పోస్ట్‌లతో సోషల్ మీడియాలో రచ్చ!

ఎలక్షన్ల సమయం దగ్గరపడటంతో రోజురోజుకు ఏపీ రాజీయాలు వేడెక్కుతున్నాయి.

Update: 2024-05-07 12:25 GMT

దిశ, సినిమా: ఎలక్షన్ల సమయం దగ్గరపడటంతో రోజురోజుకు ఏపీ రాజీయాలు వేడెక్కుతున్నాయి. ఈ బరిలో గెలుపో.. ఓటమో తేల్చుకునేందుకు అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రచారాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడంతో అక్కడ ప్రచారంలో పాల్గొంటున్నాడు. అయితే.. పవన్ కల్యాణ్‌కు టాలీవుడ్ నుంచి మద్దతూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ల టైం దగ్గరపడటంతో హీరోలు ఒక్కొక్కురుగా తన మద్దతును తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్‌లతో రచ్చ చేస్తున్నారు.

ఇప్పటికే జబర్దస్త్ నటులు, మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మద్దతు తెలుపుతూ వీడియోలు, పోస్ట్‌లు రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్న తేజా సజ్జా కూడా తన మద్దతు పవన్ కల్యాణ్‌కే అన్నట్టుగా పోస్ట్ పెట్టాడు. ‘ముందు ఉన్న బిగ్‌డే కోసం పవన్ కల్యాణ్‌కు బెస్ట్ విషెస్ చెబుతున్నాను. దయచేసి మమ్మల్ని గర్వపడేలా చేయండి’ అంటూ తన ఇన్‌స్టా స్టోరిలో పవన్ కల్యాణ్ ఫొటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 

Read More...

జనసేన పవన్ కళ్యాణ్‌ను గెలిపించండి..రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్! 






 


Similar News