గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ జాబ్- శాలరీ- ఫేవరెట్ హీరోయిన్..!!

నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Update: 2024-03-27 11:44 GMT

దిశ, సినిమా: నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన చరణ్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో చరణ్ కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొస్తున్నాయి. 1985 మార్చి 27 న జన్మించాడు. అయితే చరణ్ యాక్టర్ కాకముందు మొదట్లో క్రికెటర్ అవుదామనుకున్నాడట. ఇందుకోసం శిక్షణ కూడా తీసుకున్నాడట. తర్వాత ఆటో మొబైల్ ఇంటనీర్ చేయాలనుకున్నాడట.

చిరవరు నటనపై ఇంట్రెస్ట్ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇకపోతే చరణ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చరణ్ మొదట ఏం ఉద్యోగం చేశాడని, శాలరీ ఎంతని ప్రశ్నించగా.. ‘నా మొదటి ఉద్యోగం ఇంట్లోనే చేశానని, కానీ జీతం ఇవ్వలేదని’ చరణ్ అన్నాడు. కానీ ఏం ఉద్యోగం చేశాడని మాత్రం రివీల్ చేయలేదు. అలాగే హీరోయిన్ కియారా అద్వానీ యాక్టింగ్ అంటే ఇష్టమని తెలిపాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Similar News