కవిమాట:వానా వానా వల్లప్పా !

Update: 2022-07-17 19:00 GMT

గ్రీష్మతాపంలో స్వేదం చిమ్మాక

కొన్ని చిరుజల్లులు కురుస్తే

హరివిల్లులు విరిస్తే

మది మధురగీతాలు పాడుతుంది

మనసంతా సేద తీరుతుంది

ప్రకృతి ఋతుచక్రం

గిర్రున తిరిగి గిరికీలు కొట్టేస్తే

బ్రతుకంతా తల క్రిందులు

చినుకు పలకరింతలకు

మనమే కాదు పశుపక్ష్యాదులు

పులకరిస్తాయి

వానా వానా వల్లప్పా..అంటూ

చిందులు వేసి సందడి చేస్తయి

మనిషి మనుగడలో

అతివృష్టి అనావృష్టి

ఏదీ సహించదు జనజీవం

అమరనాథ్ క్షేత్రంలో

ఆకస్మిక వరదల హోరు

మృత్యుగీతాల తీరు

దు:ఖపు పాదముద్రలే

ముంచెత్తుతున్న వరదలు

విపత్తుల

విచ్చుకత్తుల్ని దించుతున్నాయి

కుండపోత బాధల వలపోత

ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మా

గుండె చెరువవుతున్న

అశ్రుదారలు చూడమ్మా

ప్రమాదపు హెచ్చరిక వైతివి

పదిలమవ్వుట ఏలనమ్మా

మాకు మేమే బరువవుతున్నం

మాకు మేమే భారమవుతున్నం

తడిసి ముద్దవుతున్న

తనువెల్లా నిలువెల్లా వీడ్కోలు

వినయంగా వేడ్కోలు

కాస్త తెరిపి ఇవ్వు

తేరుకుంటాం..తేలిక పడిపోతాం..

 డా. కటుకోఝ్వల రమేశ్

9949083327

Tags:    

Similar News