కేంద్రంపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

దిశ, తెలంగాణ బ్యూరో : ‘ఎన్డీఏ అంటే నో డేటా అవెలబుల్ గవర్నమెంట్.. నో డేటా ఆఫ్ హెల్త్ కేర్ స్టాప్ హు డైడ్’.. అని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ బుధవారం కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు చేశారు. కొవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈఎస్ పరిశ్రమలు మూతపడిన డేటా లేదని, ఎంత మంది వలస కార్మికులు మృతి చెందారనే వివరాలు కూడా లేవన్నారు. కరోనా కష్టకాలంలో ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారనే వివరాలతో పాటు 20లక్షల కోట ప్యాకేజీ లబ్ధిదారుల […]

Update: 2021-12-01 09:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ‘ఎన్డీఏ అంటే నో డేటా అవెలబుల్ గవర్నమెంట్.. నో డేటా ఆఫ్ హెల్త్ కేర్ స్టాప్ హు డైడ్’.. అని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ బుధవారం కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు చేశారు. కొవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈఎస్ పరిశ్రమలు మూతపడిన డేటా లేదని, ఎంత మంది వలస కార్మికులు మృతి చెందారనే వివరాలు కూడా లేవన్నారు. కరోనా కష్టకాలంలో ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారనే వివరాలతో పాటు 20లక్షల కోట ప్యాకేజీ లబ్ధిదారుల సమాచారం లేదన్నారు. వ్యవసాయచట్టాల రద్దుకోసం చేపట్టిన పోరాటంలో ఎంత మంది రైతులు మృతిచెందారనే వివరాలు కూడా లేకపోవడం దుర్మార్గమని అని అన్నారు. ఇది కేంద్రం తీరుకు, ప్రజలపై, రైతులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమని దుయ్యట్టారు.

Tags:    

Similar News