ముస్లిం రిజర్వేషన్లు బీసీలవే!

All Muslim reservations are BC reservations

Update: 2024-05-07 01:00 GMT

ఈ దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని ప్రకటించిన కాంగ్రెస్.. రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ‘నవ్విపోదురు గాక నాకేటి’ అనే చందంగా వ్యవహరించడం ఈ దేశంలో ఒక్క కాంగ్రెస్‌కే చెల్లింది. రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించింది ఆ పార్టీ. బీసీల కంచంలోని మెతుకులను బలవంతంగా లాక్కొని ముస్లింల నోట్లో పెట్టిన కాంగ్రెస్ .. నేడు బీసీ, ఎస్సీ, ఎస్టీలపై కపట ప్రేమ ఒలకబోస్తోంది. రాజ్యాంగ విరుద్ధంగా అక్రమ మార్గాల్లో బీసీల రిజర్వేషన్లు తొలగించి, ముస్లింలకు అప్పజెప్తూ రాజకీయ లబ్ధి పొందుతున్న కాంగ్రెస్ పార్టీ .. రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ బీజేపీపై విమర్శలు గుప్పించడం హాస్యాస్పదం.

బడుగు బలహీనులకు, వాస్తవమైన అర్హులకు రాజ్యాంగం అందించిన రిజర్వేషన్లపై నేడు భారత ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశమైంది. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను సైతం వక్రీకరించి, అధునాతన సాంకేతికత ఆధారంగా వారి మాటలను మార్ఫింగ్ చేసి ప్రజల్లోకి వదలడం చర్చనీయాంశమైంది. అసలు సమస్యలను వదిలి, రాజకీయ లబ్దికోసం నిరాధార ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. రిజర్వేషన్లను తొలగించి హిందూ రాజ్యాన్ని తీసుకొస్తారని ముస్లింలను ప్రేరేపించి రాజకీయ లబ్ధి పొందే దుర్మార్గపు ఆలోచన చేయడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం. బీసీల కోటాలోంచి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంతో వందల సంఖ్యలో ఉన్న బీసీ కులాల వారు విద్య, ఉద్యోగానికి దూరమయ్యారు. బీసీల నోటికాడి ముద్దను లాక్కొని ముస్లింలు నోట్లో పెట్టారు. బీసీలు పొందాల్సిన విద్యా, ఉద్యోగాలను రాజకీయ అండదండలతో నేడు ముస్లింలు అందుకోవడం గమనార్హం.

రిజర్వేషన్ ప్రధాన ఎజెండానా?

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి తీరుతామని, మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగం ఒప్పుకోదని.. అలాంటి రిజర్వేషన్లతో అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడిన తీరు ఆమోదయోగ్యం. కానీ రాజకీయ లబ్ధి కోసం ముస్లిం డీఎన్ఏ ఒంట పట్టించుకున్న కాంగ్రెస్ పార్టీ.. రాజకీయ విలువలను తుంగలో తొక్కి మార్ఫింగ్ వీడియోతో ప్రశాంత సమాజంలో అలజడులు రేపేందుకు కుట్రలకు తెర తీయడం దేశద్రోహం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సిద్దిపేట బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడిన మాటలు వక్రీకరించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తొలగిస్తారని తప్పుడు మాటలు సృష్టించడం ముమ్మాటికి నేరం. ఏదో విధంగా రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే దురాలోచనతో చేసిన కుట్రలను ఎన్నికల్లో ప్రధాన జెండాగా మార్చడం కాంగ్రెస్ పార్టీ దివాలాకోరుతనానికి అద్దం పడుతున్నాయి.

రిజర్వేషన్లకు ఆరెస్సెస్ వ్యతిరేకమా?

2025 నాటికి ఈ దేశాన్ని హిందూ దేశంగా మారుస్తారన్న నిరాధార మాటలు రేవంత్ స్థాయిని మరింత తగ్గిస్తాయని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. రిజర్వేషన్లకు మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అర్హులందరికీ రిజర్వేషన్లు అందాలి. సమాజంలో అసమానతలు మాసిపోయే వరకు రిజర్వేషన్లు కొనసాగాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ మద్దతిస్తూనే ఉంది. నకిలీ మేధస్సు (కృత్రిమ మేధ) ఉపయోగించి సోషల్ మీడియాలో పనిగట్టుకుని కొంతమంది గుండాలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై దుష్ప్రచారం చేసి సమాజంలో విభేదాలు సృష్టిస్తున్నారు. సోషల్ మీడియాలో రిజర్వేషన్లపై వస్తున్న వదంతుల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారని గుర్తించుకోవాలి.

బుజ్జగించు... రెచ్చగొట్టు..!

అయినా పనిగట్టుకుని ముస్లిం.. గిరిజనులు... దళితుల ఓట్లు గంపగుత్తగా పొంది, అధికారాన్ని సంపాదించుకోవాలనే దుర్బుద్ధితో రెచ్చగొట్టే విధానాన్ని అవలంబిస్తోంది కాంగ్రెస్ పార్టీ. వాస్తవాలను వక్రీకరిస్తున్న నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని విషయం తెలుసుకోవాలి. కాంగ్రెస్ మాత్రం తమ డీఎన్ఏను మరోసారి బయటపెట్టి.. ముస్లిం ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుంది. గంపగుత్తగా ముస్లిం ఓట్లు పొంది అధికారం అనుభవించే దురాలోచనతో రిజర్వేషన్ల అంశంపై రెచ్చగొట్టి, ఆర్ఎస్ఎస్‌పై విద్వేషాలు నింపడంపై ప్రణాళికలు వేస్తోంది. అంతేగాక కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉందో అక్కడ బీసీ రిజర్వేషన్లను కోత విధించి వాటిలోంచి కొంత లాక్కొని ముస్లింలకు వండి వడ్డిస్తోంది. దీంతో అర్హులైన బీసీల నోటికాడి ముద్దను కాంగ్రెస్ పార్టీ లాక్కొని ముస్లింల నోట్లు పెడుతుంది. పైగా సెక్యులరిజం మంత్రం జపిస్తూ సమానత్వమే మా విధానం అంటూ ఉపన్యాసాలు ఇస్తూ నమ్మబలికేందుకు నాటకాలు ఆడుతుంది. కాంగ్రెస్ చేస్తున్న మోసాలపై బీసీలు వాస్తవం గ్రహించి తగు సమాధానం చెప్పాలి.

అప్పనంగా ముస్లింలకు రిజర్వేషన్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బీసీల వాటాను లాక్కుని ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను అప్పనంగా అప్పగించిన వైనం అందరికీ తెలిసిందే. ఇదే తంతు కాంగ్రెస్ కర్ణాటక మరియు ఆ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు అప్పజెబుతుంది. సమాజంలో విద్వేషాలు సృష్టించి విభజించి పాలించు అనే రీతిలో మనుషుల మధ్య దూరం పెంచే కుట్రలను ప్రజలు గమనించాలి. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ మరో కొత్త నాటకానికి తెర లేపింది. కాంగ్రెస్ కుట్రలను నిశితంగా పరిశీలించి, ఆలోచనతో సమాధానం చెప్పేందుకు బీసీలు అంతా సిద్ధంగా ఉండాలి. దేశవ్యాప్తంగా మత ప్రాతిపదికన అమలు చేసే రిజర్వేషన్లు మాత్రం ముమ్మాటికి తొలగించి తీరాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగించి తీరుతామని నరేంద్ర మోడీ, అమిత్ షా మాటలను ప్రతి బీసీ స్వాగతించాల్సిందే. ఏది ఏమైనా ఆదివాసులు, దళితులు ,గిరిజనులు, వెనుకబడిన బీసీలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి సామాజిక గౌరవం పొందేదాకా రిజర్వేషన్లు అమలు కావాల్సిందే. ఈ విషయంలో ఎటువంటి రాజీలేదు.

పగుడాకుల బాలస్వామి

ప్రచార ప్రముఖ్, వీహెచ్‌పీ, తెలంగాణ

99129 75753

Tags:    

Similar News