పెన్షన్ దారులకు భారీ గుడ్ న్యూస్.. ఆసరా పెన్షన్ల పంపిణీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

‘ఆసరా’ లబ్ధిదారులకు ఫస్ట్ వీక్‌లో పింఛన్లు అందేలా సర్కారు ప్రణాళిక రూపొందించింది. గత శనివారం నుంచే పంపిణీ కార్యక్రమాన్ని

Update: 2024-05-07 02:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఆసరా’ లబ్ధిదారులకు ఫస్ట్ వీక్‌లో పింఛన్లు అందేలా సర్కారు ప్రణాళిక రూపొందించింది. గత శనివారం నుంచే పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మంగళవారం కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. దీంతో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి మొదటి వారంలో ఆసరా పెన్షన్లు అందాయి. కాగా, ఇప్పటి నుంచి ప్రతి నెల మొదటివారంలోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం కావాల్సిన నిధులను ముందుగానే రెడీ చేయాలని ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్టు సమాచారం.

గతంలో ఎదురుచూపులు..

గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూసేవారు. ఏ రోజు ఇస్తారోనని తెలియక గ్రామ పంచాయతీ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టేవారు. ఒక నెల ఒక తేదీన పెన్షన్ ఇస్తే, మరో నెలలో మరో తేదీన, కొన్ని సార్లు నెల చివరన పంపిణీ చేసేవారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల మొదటివారంలోనే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ నెలలో 4వ తేదీన ప్రారంభించిన పెన్షన్ల పంపిణీ 6, 7 తేదీల్లో పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పెన్షన్ల పంపిణీ పొగ్రామ్ కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రతి నెల ఒకటో తేదీన ఎంప్లాయీస్‌కు జీతాలు ఇస్తున్నారు. భవిష్యత్తులో సుమారు 38 లక్షల మంది ఆసరా పెన్షనర్లకు కూడా మొదటి తేదీనే పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

భట్టి విక్రమార్క ఫోకస్

ఆసరా పెన్షన్ల కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ వర్కర్స్, ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి నెల చివరన పెన్షన్ ఇచ్చేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నెల మొదటి వారంలో, వీలైతే ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ భట్టీ విక్రమార్క ఆధికారులను ఆదేశించినట్టు సమాచారం.

దీంతో అధికారులు ఎంప్లాయీస్‌కు జీతాలు ఇచ్చిన వెంటనే ఆసరా పెన్షన్లకు కావాల్సిన నిధులను విడుదల చేశారు. ‘ఎంప్లాయీస్‌కు ప్రతినెల ఫస్ట్‌న ఠంచన్‌గా జీతాలు ఇస్తున్నాం. పెన్షన్ దారులకు పెన్షన్ అందిస్తున్నాం. అలాగే ఆసరా లబ్దిదారులకు పెన్షన్లు ఇవ్వండి. అందుకు కావాల్సిన నిధులను ముందే రెడీ చేయండి’ అని భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Similar News