ICMR పరిశీలనలో ఆనందయ్య కరోనా మందు..

దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా నివారణకు కోసం ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద ఔషధాన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ICMR బృందం జిల్లాకు చేరుకుంది.శుక్రవారం సాయంత్రం ఐసీఎంఆర్ బృందం సభ్యులు ఆనందయ్య తయారీ ఔషధాన్ని పరిశీలించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం జగన్ సూచన ఆయుర్వేద ఔషధాన్ని సైంటిఫిక్ నిర్ధారణ కోసం ఐసీఎంఆర్ బృందం పరీక్షించనున్నది. ఆయుర్వేద ఔషధం తయారికి ఆనందయ్య ఉపయోగించే చెట్ల ఆకులు, పదార్థాలను వారు సేకరించారు. అనంతరం ఔషధ తయారీ […]

Update: 2021-05-21 11:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా నివారణకు కోసం ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద ఔషధాన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ICMR బృందం జిల్లాకు చేరుకుంది.శుక్రవారం సాయంత్రం ఐసీఎంఆర్ బృందం సభ్యులు ఆనందయ్య తయారీ ఔషధాన్ని పరిశీలించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం జగన్ సూచన ఆయుర్వేద ఔషధాన్ని సైంటిఫిక్ నిర్ధారణ కోసం ఐసీఎంఆర్ బృందం పరీక్షించనున్నది.

ఆయుర్వేద ఔషధం తయారికి ఆనందయ్య ఉపయోగించే చెట్ల ఆకులు, పదార్థాలను వారు సేకరించారు. అనంతరం ఔషధ తయారీ విధానాన్ని ఆనందయ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ మందుతో ఏమైనా దుష్ఫలితాలు వస్తాయా? అనే విషయంపై ఐసీఎంఆర్ బృందం ఆరా తీసింది. ఈ బృందం వెంట నెల్లూరు జేసీ హరేంద్రప్రసాద్, డీపీవో ధనలక్ష్మీ ఉన్నారు.

Tags:    

Similar News