ఖ‌మ్మం మిర్చి రైతుల‌కు వ‌డ్డీలేని రుణాలు !

దిశ‌, ఖ‌మ్మం: మిర్చి రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా నిలిచే ప్ర‌య‌త్నం చేస్తోంది. లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌డంతో మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈనేప‌థ్యంలో కూలీల‌కు చెల్లింపుల‌కు, ఇత‌ర అవ‌స‌రాల‌కు రైతులు ఆర్థిక‌ ఇబ్బందులు ఎదుర్కొనే ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌భుత్వం గ‌తంలో ప్ర‌వేశ‌పెట్టిన రైతుబంధు ప‌థ‌కానికి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. రైతుల అవ‌స‌రాల‌ను ఆస‌రాగా చేసుకుని కొంత‌మంది అక్ర‌మంగా కొనుగోళ్ల‌కు దిగుతున్న క్ర‌మంలోనే మార్కెటింగ్ అధికారులు, జిల్లా క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. క‌లెక్ట‌ర్ ప్ర‌త్యేక చొర‌వ‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి […]

Update: 2020-04-22 06:14 GMT

దిశ‌, ఖ‌మ్మం: మిర్చి రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా నిలిచే ప్ర‌య‌త్నం చేస్తోంది. లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌డంతో మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈనేప‌థ్యంలో కూలీల‌కు చెల్లింపుల‌కు, ఇత‌ర అవ‌స‌రాల‌కు రైతులు ఆర్థిక‌ ఇబ్బందులు ఎదుర్కొనే ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌భుత్వం గ‌తంలో ప్ర‌వేశ‌పెట్టిన రైతుబంధు ప‌థ‌కానికి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. రైతుల అవ‌స‌రాల‌ను ఆస‌రాగా చేసుకుని కొంత‌మంది అక్ర‌మంగా కొనుగోళ్ల‌కు దిగుతున్న క్ర‌మంలోనే మార్కెటింగ్ అధికారులు, జిల్లా క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. క‌లెక్ట‌ర్ ప్ర‌త్యేక చొర‌వ‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి రూ.18కోట్లు రైతుబంధు ప‌థకానికి మంజూరు కావ‌డం విశేషం. అలాగే ఖ‌మ్మం వ్య‌వ‌సాయ మార్కెట్ కూడా రూ.2కోట్ల‌ను ఇందుకోసం కేటాయింపులు చేసింది. మొత్తం రూ.20కోట్లతో రైతుబంధు కింద రైతుల‌కు రుణాల‌ను ఇవ్వ‌డం జ‌రుగుతోంది.

600మందికి రుణాలు

ఇప్ప‌టి వ‌ర‌కు కోల్డ్‌స్టోరీజిల్లో మిర్చిని నిల్వ చేసుకున్న 600మంది రైతుల‌కు రుణాల‌ను మంజూరు చేశారు. నిల్వ చేసుకున్న స‌రుకుపై గ‌రిష్ఠంగా రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌ను మంజూరు చేస్తున్న‌ట్లు ఖ‌మ్మం మార్కెట్ ఛైర్మ‌న్ మ‌ద్దినేని వెంక‌ట‌ర‌మ‌ణ చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాలో 619 మంది మిర్చి రైతులు రైతుబంధు ప‌థ‌కం కింద రుణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా 600మందికి రూ.6.5కోట్లు మంజూరు చేసిన‌ట్లు తెలిపారు. మిగ‌తా 19మందికి ఇచ్చే ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌లోనే మిగతా రైతులంద‌రికీ మంజూరైన మొత్తం రూ.18కోట్ల‌ను రుణాలుగా అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. రైతుబంధు ప‌థ‌కం కింద మంజూరు చేసిన రుణాల‌పై మొద‌టి ఆరునెల‌ల పాటు ఎలాంటి వ‌డ్డీ చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఆరునెల‌ల త‌ర్వాత తీసుకున్న మొత్తంపై 12శాతం వ‌డ్డీ విధిస్తారు.

కోల్డ్ స్టోరేజీల్లో 75శాతం రైతుల సరుకే

ఖ‌మ్మం జిల్లాలో 37కోల్డ్ స్టోరేజీలుండ‌గా.. ఖ‌మ్మం వ్య‌వ‌సాయ మార్కెట్ ప‌రిధిలో 15ఉన్నాయి. జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల సామర్థ్యం 34.5 లక్షల క్వింటాళ్లు. ఇప్ప‌టికే దాదాపుగా నిండిపోగా కేవ‌లం 2.5ల‌క్ష‌ల క్వింటాళ్ల నిల్వకు అవ‌కాశం ఉంద‌ని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలామంది రైతులు త‌మ స‌రుకును కోల్డ్ స్టోరేజీల‌కు త‌ర‌లించి నిల్వ చేసుకున్నారు. వ్యాపారుల స‌రుకు ఎక్కువ‌గా నిల్వ చేసుకుంటున్నారు.. రైతుల స‌రుకును ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఇటీవల అధికారులు విస్తృతంగా త‌నిఖీలు చేప‌ట్టారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కోల్డ్ స్టోరేజీల యాజ‌మాన్యాల‌కు నోటీసులు జారీ చేశారు. త‌నిఖీల నిర్వ‌హ‌ణ‌లో విఫ‌ల‌మైన జిల్లా మార్కెటింగ్ అధికారిపై వేటు ప‌డిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం జిల్లాలోని అన్ని కోల్డ్ స్టోరేజీల్లో 75శాతం స‌రుకు రైతుల‌దేన‌ని, మిగ‌తాది వ్యాపారుల‌కు సంబంధించినద‌ని మార్కెటింగ్ అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు.

tags: Khammam, Mirchi Farmers, Interest-free Loans, Farmer Relative Scheme, Marketing officers, Cold Storage

Tags:    

Similar News