తెలంగాణకు యూత్ ఐకాన్

ఎందరో నాయకులు రాజకీయాలకు వచ్చినా కొందరు మాత్రమే ప్రజల గుండెలలో నిలిచిపోతారు. ఆ కోవకి చెందినవారే . తెలంగాణ ప్రజల మనసులో తనదైన ముద్ర బలంగా వేసుకున్నారు. ఉద్యమ నేతగా ఉన్నా, మంత్రిగా ఉన్నా ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచించి తన పరిధి మేరకు పని చేసుకుంటూ దూసుకుపోవడమే ఆయన ఎంచుకున్న మార్గం.

Update: 2022-06-02 18:30 GMT

ఎందరో నాయకులు రాజకీయాలకు వచ్చినా కొందరు మాత్రమే ప్రజల గుండెలలో నిలిచిపోతారు. ఆ కోవకి చెందినవారే . తెలంగాణ ప్రజల మనసులో తనదైన ముద్ర బలంగా వేసుకున్నారు. ఉద్యమ నేతగా ఉన్నా, మంత్రిగా ఉన్నా ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచించి తన పరిధి మేరకు పని చేసుకుంటూ దూసుకుపోవడమే ఆయన ఎంచుకున్న మార్గం. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ప్రజల కోసమే పని చేసే హార్డ్ వర్కర్‌గా ప్రతిపక్షాల నుంచి కూడా 'శభాష్' అనిపించుకున్న నాయకుడాయన. 2004 లో సిద్దిపేట నుంచి శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలో కేసీఆర్ వారసునిగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన ఆయన ఇక వెనుకకు చూడలేదు. క్రమక్రమంగా జిల్లా, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో హరీశ్‌రావు పాత్ర సువర్ణక్షరాలతో లిఖించదగినది. పచ్చి సమైక్యవాది అయిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అసెంబ్లీలో తెలంగాణ గొంతుకై నిలువరించిన ఘనత ఆయనది. మాస్‌ లీడర్‌గా ఉంటూనే, క్లాస్ లీడర్‌గా పేరు తెచ్చుకోవడం ఆయన ఘనత. తన దృష్టికి ఏ సమస్య వచ్చినా చటుక్కున స్పందించడం ఆయనకే సొంతం. కేసీఆర్ చరిత్రాత్మక దీక్షలోనూ హరీశ్‌రావు పాత్ర వెలకట్టలేనిది. 'ఇంట గెలిచి రచ్చ గెలవాలి' అన్నట్టుగా సిద్దిపేటను అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపారు. మంత్రిగా రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నా ఆయన మనసంతా సిద్దిపేట పైనే.

సిద్దిపేట ప్రగతిలో

సిద్దిపేటలో వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ ప్రతీసారి తన రికార్డులను తానే తిరగరాసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక భారీ నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ, మైనింగ్ వ్యవహారాల శాఖల మంత్రిగా సత్తా చాటారు. కేసీఆర్ అడుగులో అడుగేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటల పునరుద్ధరణలో కీలకంగా వ్యవహరించారు. తనకు ఏ పని అప్పగించినా నూటికి నూరు శాతం బాధ్యతగా పని చేయడం హరీశ్‌రావుకే చెల్లుతుంది.

నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రంలో వైద్య వ్యవస్థను సుస్థిరం చేస్తున్నారు. సర్కారు దవాఖానాలను తీర్చిదిద్దుతున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలను నిజం చేయడంలో ముందుంటున్నారు. తెలంగాణ యువ సమాజానికి ఐకాన్‌గా నిలుస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి గొంతుకగా ఉండి ప్రతిపక్ష నాయకుల గుండెలలో నిద్ర పోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి వేగంగా తీసుకెళ్లాలనే సంకల్పం, ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యం, మెరుగైన సమాజం ఏర్పాటు చేసి భావితరాలకు ఆదర్శంగా నిలపాలన్న ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్న హరీశ్‌రావు జన్మదినం నేడు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

జీడిపల్లి రాంరెడ్డి

తొగుట, 96666 80051

Tags:    

Similar News