అది క్షమించరాని నేరం.. వారికి నిజామాబాద్ కలెక్టర్ హెచ్చరిక

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని అమ్మకాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు గుర్తించి పదిరోజుల్లో బౌండరీలు ఫిక్స్ చేసి, బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్‌లోని ధర్మపురి హిల్స్, అర్సపల్లి, సారంగాపూర్ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాలు 12, 13, 14 డివిజన్‌లలో […]

Update: 2021-12-03 05:15 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని అమ్మకాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు గుర్తించి పదిరోజుల్లో బౌండరీలు ఫిక్స్ చేసి, బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్‌లోని ధర్మపురి హిల్స్, అర్సపల్లి, సారంగాపూర్ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాలు 12, 13, 14 డివిజన్‌లలో కొందరు కబ్జా చేస్తున్నారని తెలిసి పరిశీలించామన్నారు. ఇక్కడ బ్లాస్టింగ్ చేసి లెవెల్ చేయడం, గ్రావెల్ వేసి రోడ్డు ఏర్పాటు చేయడం, అక్కడక్కడ చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని ఉండటం లాంటివి చూశామని వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు.

దీనిపై మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ చేస్తారని, ఆర్డీఓ పదిరోజుల్లో అన్ని వివరాలు సేకరించి ప్రభుత్వ స్థలానికి బౌండరీలు ఫిక్స్ చేయాలని, ప్రభుత్వ స్థలం అని తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బోర్డులు ఏర్పాటు చేసినా, చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం చేస్తే వాటిని తొలగించాలన్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తోందని, నిజామాబాద్ అర్బన్‌లో ఇంకా 15 వందల నుండి 2 వేల వరకు ఇండ్లకు స్థలం కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. వాటిలో పేదవారిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇచ్చే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వ స్థలాలను ఎవరన్నా అమ్మితే కొని మోసపోవద్దని సూచించారు.

ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే క్షమించరాని నేరమని హెచ్చరించారు. ఇప్పటివరకూ ఆక్రమణకు గురైన వాటిపై డీటెయిల్‌గా విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, ఆర్డీఓ రవి, డివిజన్ కార్పొరేటర్లు, తహసీల్దార్‌లు ప్రశాంత్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News