కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఘాటు విమర్శలు

కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు.

Update: 2024-04-30 08:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో మార్పు అంటే కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలే అన్నారు. వంద సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టను కాంగ్రెస్ దెబ్బతీసిందని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీకి కరెంటు, నీళ్లు ఇవ్వలేము విద్యార్థులు ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందన్నారు.

మహబూబ్ నగర్‌లో కేసీఆర్ బస చేస్తే కరెంటు పోయిందన్నారు. యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ నోటీసులు ఎట్లా ఇస్తారని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. కేసీఆర్ స్పందించిన తర్వాత ప్రభుత్వం చీఫ్ వార్డెన్‌కు షోకాజు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి యూనివర్సిటీలో కరెంటు, నీళ్ళు ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చారని.. చిన్న అధికారిని బలి చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పై స్థాయి అధికారులకు తెలియకుండా చీఫ్ వార్డెన్స ర్క్యులర్ జారీ చేయలేడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజ స్వరూపం బయటపడిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగ మంత్రి లేడు, ఎంపీ టిక్కెట్ ఇవ్వరన్నారు. మాదిగలను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఫైర్ అయ్యారు. షోకాజు నోటీసులు సీఎం,డిప్యూటీ సీఎంలకు ఇవ్వాలి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అమలు కానీ హామీలు ఇచ్చి ఇప్పుడు ఒక్కటి నేరవేర్చడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగు, తాగు నీరు లేనిపరిస్థితి వచ్చిందన్నారు. ఖాళీ బిందెలతోమహిళలు రోడ్డు ఎక్కుతున్నారన్నారు. కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎందుకు ఇవ్వడం లేదన్నారు. మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం...బోగస్ప్ర భుత్వంగా మారిందని సెటైర్లు వేశారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు చేస్తోందన్నారు. యూనివర్సిటీలో 4 వ సెమిస్టర్ పరీక్షలు వుంటే హాలిడేస్ఎ ట్లా ప్రకటిస్తారని ప్రశ్నించారు. యూనివర్సిటీలో చదివే విద్యార్థులు అంతా బీసీ, ఎస్సి, ఎస్టీలకు చెందిన వారని తెలిపారు. యూనివర్సిటీ నుండి విద్యార్థులను వెల్లగొట్టే కుట్ర జరిగిందన్నారు. ప్రభుత్వ చేతగానితనానికి ఎస్సి అధికారికి షోకాజు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు యూనివర్సిటీ విద్యార్థులు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలన్నారు. నిరుద్యోగ భృతి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన సంగతి భట్టికి తెలియదన్నారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలని మంత్రి అన్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి మొత్తం కమీషన్లపైన వుందన్నారు. 

Similar News