BJPకి వరం అదే.. బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్

పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుడుపడుతున్నాయి.

Update: 2024-04-30 09:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుడుపడుతున్నాయి. నేరుగా మాటల దాడితో పాటు సోషల్ మీడియా వేదికగా ఎప్పటిప్పుడు పార్టీల విధానాలపై కౌంటర్లు ఇస్తున్నాయి. ఇక, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది. ‘బీజేపీని ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ. గత పదేళ్లలో.. అధికారంలోకి వచ్చిన 7 రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాన్ని బీజేపీ నుండి కాపాడుకోలేకపోయింది.

బీజేపీని నిలువరించే సత్తా కేవలం బలమైన ప్రాంతీయ శక్తులకు మాత్రమే ఉంది.’ అని ట్వీట్ చేసింది. కాంగ్రెస్ చేతగానితనం.. బీజేపీకి వరం.. బీజేపీని ఎదుర్కొనడంలో ఘోరం కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. గత పదేళ్లలో.. అధికారంలోకి వచ్చిన 7 రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాన్ని బీజేపీ నుంచి కాపాడలేకపోయిన కాంగ్రెస్.. పైగా.. బీజేపీపై పోరాడుతున్న బీఆర్ఎస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలపై బీజేపీ - బీ- టీమ్ అని కాంగ్రెస్ నాయకులు ముద్ర వేస్తున్నారు.’ అని ట్వీట్ చేసింది.

Similar News