క్షేత్రస్థాయిలో నిర్మల్ కలెక్టర్ తనిఖీలు

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ శశిధర్ రాజులు క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈద్గాం చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, బైల్ బజార్ తదితర ప్రాంతాల్లో ఇద్దరూ పర్యటించారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు నిబంధనలను కట్టుదిట్టంగా అమలు […]

Update: 2020-04-19 11:08 GMT

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ శశిధర్ రాజులు క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈద్గాం చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, బైల్ బజార్ తదితర ప్రాంతాల్లో ఇద్దరూ పర్యటించారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. రెడ్‌జోన్లలో సోమవారం నుంచి తిరిగి సర్వే ప్రారంభిస్తున్నందున తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, ఎస్పీ దిశానిర్దేశం చేశారు.

tags : collector and sp night check, corona, lockdown, nirmal dist

Tags:    

Similar News