ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి రాగి తీగల చోరి

లోకేశ్వరం మండలంలోని పంచ గుడి ఎత్తిపోతల పథకానికి చెందిన విద్యుత్ సబ్ స్టేషన్ లోని రెండు ట్రాన్స్ఫార్మర్లు గుర్తుతెలియని దుండగులు శనివారం రాత్రి ధ్వంసం చేసి వాటిలోని రాగి తీగలను చోరీ చేశారు.

Update: 2024-05-26 12:20 GMT

దిశ, లోకేశ్వరం: లోకేశ్వరం మండలంలోని పంచ గుడి ఎత్తిపోతల పథకానికి చెందిన విద్యుత్ సబ్ స్టేషన్ లోని రెండు ట్రాన్స్ఫార్మర్లు గుర్తుతెలియని దుండగులు శనివారం రాత్రి ధ్వంసం చేసి వాటిలోని రాగి తీగలను చోరీ చేశారు. చోరీకి గురైన రాగి తీగలు, ఇతర వస్తువుల విలువ దాదాపు రూపాయలు 14 లక్షల వరకు ఉంటుందని సమాచారం. దీంతో ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం ఉదయం గమనించిన ఎత్తిపోతల పథకం కమిటీ సభ్యులు లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి విద్యుత్ శాఖ ఏఈకి సమాచారం ఇచ్చారు. గతంలో కూడా ఇదే తరహాలో కనకాపూర్ ఎత్తిపోతల పథకానికి చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి తీగలను చోరీ చేశారు. కాగా రైతులు డబ్బులను జమ చేసి మరమ్మతులు చేయించుకున్నారు. కానీ నిందితులు ఇంతవరకు పట్టుబడలేదు. దుండగులు పక్కా ప్రణాళికతో గోదావరి పరివాహక ప్రాంతంలోని ట్రాన్స్ఫార్మర్లను మాత్రమే ధ్వంసం చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు.

Similar News