అయోధ్య రామాలయానికి రూ.2000కోట్లు : యోగి

దిశ, వెబ్‌డెస్క్ : అయోధ్య రామమందిరం నిర్మాణంపై యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామాలయ నిర్మాణంపై రాజీ పడే ప్రసక్తి లేదని మరోసారి స్పష్టం చేశారు. అయోధ్య మందిర నిర్మాణానికి రూ.2000కోట్లు ఖర్చుచేయనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయోధ్య అభివృద్ధి పనులపై సమీక్షించిన సీఎం యోగి.. భవిష్యత్‌లో అయోధ్య నగరం గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.అంతేకాకుండా, అనుకున్న సమయానికి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మందిరం నిర్మాణంలో […]

Update: 2020-09-03 21:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

అయోధ్య రామమందిరం నిర్మాణంపై యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామాలయ నిర్మాణంపై రాజీ పడే ప్రసక్తి లేదని మరోసారి స్పష్టం చేశారు. అయోధ్య మందిర నిర్మాణానికి రూ.2000కోట్లు ఖర్చుచేయనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

అయోధ్య అభివృద్ధి పనులపై సమీక్షించిన సీఎం యోగి.. భవిష్యత్‌లో అయోధ్య నగరం గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.అంతేకాకుండా, అనుకున్న సమయానికి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మందిరం నిర్మాణంలో నాణ్యతకు ప్రియారిటీ ఇవ్వాలని.. అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏమీ లేదని సీఎం యోగి అన్నారు.

అదేవిధంగా అయోధ్యను సోలార్ సిటీగా మార్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. అయోధ్య చారిత్రక, వారసత్వ సంపదను కాపాడేలా ప్రణాళిక ఉండాలని అధికారులకు సూచించారు.

Tags:    

Similar News