జర్మనీలో చిక్కుకున్న చెస్ ఛాంపియన్

మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. సభలు, సమావేశాలు, క్రీడా టోర్నీలను రద్దు చేస్తున్నాయి. వివిధ టోర్నీల నిమిత్తం విదేశాలకు వెళ్లిన క్రీడాకారులు తిరిగి స్వదేశాలకు చేరుకుంటున్నారు. అయితే, మాజీ ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జర్మనీలో చిక్కుకుపోయారు. బుండెస్లిగాలో చెస్ టోర్నీలో పాల్గొనేందుకు ఆనంద్ ఆ దేశానికి వెళ్లారు. సోమవారం తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జర్మనీ నుంచి విమానాల రాకపోకలను భారత్ రద్దు చేసింది. దీంతో […]

Update: 2020-03-16 04:40 GMT

మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. సభలు, సమావేశాలు, క్రీడా టోర్నీలను రద్దు చేస్తున్నాయి. వివిధ టోర్నీల నిమిత్తం విదేశాలకు వెళ్లిన క్రీడాకారులు తిరిగి స్వదేశాలకు చేరుకుంటున్నారు. అయితే, మాజీ ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జర్మనీలో చిక్కుకుపోయారు. బుండెస్లిగాలో చెస్ టోర్నీలో పాల్గొనేందుకు ఆనంద్ ఆ దేశానికి వెళ్లారు. సోమవారం తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జర్మనీ నుంచి విమానాల రాకపోకలను భారత్ రద్దు చేసింది. దీంతో ఆనంద్ జర్మనీలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరినీ ప్రమాదంలో పడేయకుండా విమాన సర్వీసులను రద్దు చేయడం సరైన చర్యే’ అని ఆనంద్ భార్య అరుణ అన్నారు. తన భర్త ఎప్పుడు స్వదేశానికి తిరిగొస్తారోనని ఎదురు చూస్తున్నానని ఆమె అన్నారు.

Tags : chess champion, vishwanathan Anand, stuck in Germany, wife, Airplane cancellation, carona virus

Tags:    

Similar News