ప్రపంచంలోనే ఎక్కువ వెంట్రుకల శరీరం కలిగిన కుటుంబం.. ఎక్కడున్నారంటే?

సాధారణంగా మనుషులకు కొన్నిచోట్ల వెంట్రుకలు మోతాదులో ఉండటం చూసి ఉంటాము.

Update: 2024-05-05 12:40 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా మనుషులకు కొన్నిచోట్ల వెంట్రుకలు మోతాదులో ఉండటం చూసి ఉంటాము. కానీ కొందరు అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా తలపై జుట్టు పెంచుకుంటూ వెరైటీ ట్రెండ్‌ను ఫాలోవుతున్నారు. అయితే కొందరు పురుషులు గడ్డాలు పొడవుగా పెంచుకుంటూ గిన్నీస్ రికార్డ్‌ను సొంతం చేసుకుంటున్నారు. కానీ ఓ ఫ్యామిలీ ప్రపంచంలోనే ఎక్కువ వెంట్రుకలు కలిగిన కుటుంబంగా రికార్డు సృష్టించారు. శరీరమంతా వెంట్రుకలు కలిగి ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో వారిని చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మెక్సికోకు చెందిన విక్టర్ లారీ గోమేజ్, గాబ్రియేల్ డానీ, రామోస్ గోమెజ్, లూయిసా లిలియన్ డి లిరా అసెవ్స్, జీసస్ మాన్యువల్ హజార్డ్ అసెవ్స్ ఐదు తరాలకు చెందిన 19 మంది ఒక కుటుంబానికి చెందిన వారు. అయితే ఇందులో నలుగురు సభ్యులు జన్యుపరమైన కారణంగా ఎక్కువ వెంట్రుకలు ఉన్న ఫ్యామిలీగా గిన్నీస్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలా కూడా ఉంటుందా అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

Similar News