చెన్నయిన్, ముంబయి మ్యాచ్ డ్రా

పనాజీ: ఐఎస్ఎల్ 2020-21 సీజన్‌లో భాగంగా గోవాలోని జీఎంసీ స్టేడియంలో చెన్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్, ముంబయి సిటీ ఎఫ్‌సీల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ముంబయి జట్టు ఆటగాడు ఒగ్బెచ్ 21వ నిమిషంలో ఓ గోల్ చేయగా, చెన్నయిన్ ప్లేయర్ ఇస్మాయిల్ గోన్‌కేవ్స్ 76వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దీంతో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత మ్యాచ్ ముగిసేవరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఫలితంగా మ్యాచ్ […]

Update: 2021-01-25 12:03 GMT

పనాజీ: ఐఎస్ఎల్ 2020-21 సీజన్‌లో భాగంగా గోవాలోని జీఎంసీ స్టేడియంలో చెన్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్, ముంబయి సిటీ ఎఫ్‌సీల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ముంబయి జట్టు ఆటగాడు ఒగ్బెచ్ 21వ నిమిషంలో ఓ గోల్ చేయగా, చెన్నయిన్ ప్లేయర్ ఇస్మాయిల్ గోన్‌కేవ్స్ 76వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దీంతో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత మ్యాచ్ ముగిసేవరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఫలితంగా మ్యాచ్ డ్రా అయింది. డీహెచ్‌ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు బిపిన్ సింగ్, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఆమే రానావేడ్ సాధించారు.

Tags:    

Similar News