ప్రమాదావశాత్తు ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

దిశ, పటాన్‌చెరు: ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది ఓ కారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‎చెరు మండలం రుద్రారంలో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రహరీ గోడ ధ్వంసం అయింది. కాగా, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఇంట్లోని నిద్రిస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా […]

Update: 2020-09-09 10:34 GMT

దిశ, పటాన్‌చెరు:

ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది ఓ కారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‎చెరు మండలం రుద్రారంలో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రహరీ గోడ ధ్వంసం అయింది. కాగా, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఇంట్లోని నిద్రిస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడ్డారు. ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో తరుచూ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News