రైలు ప్రయాణికులకు ఉచిత ఆహారం.. కొత్త సేవను ప్రారంభించిన రైల్వే శాఖ

దేశవ్యాప్తంగా కొత్త కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్న రైల్వే శాఖ ఇటీవల వినియోగదారుల కోసం కొత్తగా ఒక సదుపాయాన్ని తీసుకొచ్చింది..Latest Telugu News

Update: 2022-10-27 11:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొత్త కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్న రైల్వే శాఖ ఇటీవల వినియోగదారుల కోసం కొత్తగా ఒక సదుపాయాన్ని తీసుకొచ్చింది. రైలు ప్రయాణికులకు ఉచితంగా ఆహారాన్ని అందించనుంది. ఇది పండగ సీజన్ కావడంతో ప్రజలు దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. వారికి సమయానికి భోజనం అందించడానికి రైల్వే శాఖ సిద్ధమైంది.

రాజధాని, శతాబ్ది, దురంతో వంటి రైళ్లలో ప్రయాణించే వారికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తుంది. అన్ని రైళ్లలో కాకుండా లగ్జరీ ట్రెయిన్‌లలో మాత్రమే ఈ సదుపాయాన్ని తెచ్చింది. రైలు బయలుదేరడం 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆలస్యం(లేట్) అయినప్పుడు ఉచిత ఆహారాన్ని ప్రయాణికులు పొందవచ్చు. ఇంకా ఇతర పానీయాలు కూడా ఉచితంగా లభిస్తాయి.


Similar News