బిర్యానీ టేస్ట్ కిరాక్ ఉండాలే కింగ్! హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్

భారత స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ హైదరాబాదీలకు గడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్‌లో కోహ్లీ తన రెస్టారెంట్ ఓపెన్ చేశాడు.

Update: 2024-05-24 07:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారత స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ హైదరాబాదీలకు గడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్‌లో కోహ్లీ తన రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. విరాట్ కోహ్లీ వన్ 8 కమ్యూన్ పేరుతో ఇప్పటికే బెంగళూరు, ముంబయి, పుణే, కోల్‌కతా, ఢిల్లీలో రెస్టారెంట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో రెస్టారెంట్ బ్రాంచ్ ఓపెన్ చేశాడు. హైటెక్ సిటీలోని హర్డ్ రాక్ కేఫ్‌కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని RMZది లాఫ్ట్‌లో ఈ రెస్టారెంట్‌ను నేడు ఓపెన్ చేయనున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా కోహ్లీ తన ఇన్‌స్టాలో వెల్లడించారు. మేము ఇప్పటికే హైదరాబాద్ హైటెక్ సిటీ నడిబొడ్డుకు వచ్చేశాం.. నాకు, వన్ 8 కమ్యూన్ అనేది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు.. ఇది హైదరాబాద్‌లోని ప్రజలను ఓకే చోటకు చేర్చడం మా ముఖ్య ఉద్దేశం అని కోహ్లీ పేర్కొన్నారు. అయితే ఈ రెస్టారెంట్ నేడు ఓపెనింగ్ కావడంతో అభిమానులు రెస్టారెంట్ దగ్గరికి వస్తున్నారు. రెస్టారెంట్‌లో ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ కిరాక్ ఉండాలని కింగ్.. అని విరాట్ అభిమానులు సూచనలు చేశారు. కాగా, రెస్టారెంట్‌లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులతో మెనూ పెట్టారు.

Tags:    

Similar News