మరో భారీ లేఆఫ్స్‌ ప్రక్రియకు సిద్ధమైన బైజూస్!

దేశీయ అతిపెద్ద ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ భారీ మార్పులకు సిద్ధమవుతోంది.

Update: 2023-09-27 09:08 GMT

బెంగళూరు: దేశీయ అతిపెద్ద ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ భారీ మార్పులకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు అత్యంత విజయవంతమైన స్టార్టప్‌లలో ఒకటిగా ఉన్న బైజూస్ 2020-21లో భారీ నష్టాలను ఎదుర్కొన్నది. ఆ తర్వాత 22లో 2,500 మంది ఉద్యోగులను తొలగించింది. అనంతర అనేక రౌండ్లలో పెద్ద ఎత్తున తొలగింపులను చేపట్టింది. తాజాగా మరోసారి సంస్థ పునర్‌వ్యవస్థీకరణను ప్రారంభించింది. అందులో భాగంగానే ఏకంగా 4,000-5,000 మందిని తొలగించే అవకాశం ఉందని మనీకంట్రోల్ కథనంలో పేర్కొంది.

ఇటీవల బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ స్థాయిలో తొలగింపులు జరగనుండటం గమనార్హం. కొత్త లేఆఫ్స్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఉండే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొన్ని విభాగాలను విలీనం చేసి ఖర్చు తగ్గింపుపై కంపెనీ దృష్టి సారించనుంది. కంపెనీ ప్రస్తుతం నిధుల సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీలైనంత వేగంగా పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలను అమలు చేయాలని సీఈఓ సీనియర్ ఉద్యోగులకు తెలియజేసినట్టు సమాచారం. 

Tags:    

Similar News