భారత్‌లో వాటి తయారీకి సిద్ధమవుతున్న యాపిల్..

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ ఇప్పటికే తన సంస్థ మొబైల్ ఫోన్‌లను భారత్‌తో తయారు చేస్తోంది. తాజాగా మరికొన్ని యాపిల్..

Update: 2022-10-05 08:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ ఇప్పటికే తన సంస్థ మొబైల్ ఫోన్‌లను భారత్‌తో తయారు చేస్తోంది. తాజాగా మరికొన్ని యాపిల్ ప్రొడక్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను కూడా భారత్‌కు షిఫ్ట్ చేయాలని యాపిల్ భావిస్తోందంటూ ఓ ప్రముఖ సంస్థ నివేదికలో పేర్కొంది. ఇందులో భాగంగా ఇప్పటికే యాపిత్ సంస్థ భారత్‌లోని సప్లయర్స్‌తో చర్యించిందని, యాపిల్ ఎయిర్ పాడ్స్, బీట్స్ హెడ్ ఫోన్స్ సహా మరి కొన్ని ప్రొడక్ట్స్ తయారీ భారత్‌లో ప్రారంబించాలని తెలిపిందని నివేదిక పేర్కొంది. ఈ నివేదికలో తెలిపినట్లు యాపిల్ తన ఎయిర్ పాడ్స్, హెడ్ ఫోన్స్ తయారీని భారత్‌లో ప్రారంబించేందుక తొలి సారి ప్రయత్నిస్తోంది.

అయితే ఇప్పటికే లక్స్‌షేర్ ప్రెసిషన్ సంస్థ ఇండియా, చైనాల్లో ఎయిర్ పాడ్స్‌ను తయారు చేస్తోంది. ఈ సంస్థ తాజాగా ఇండియాలో ఎయిర్ పాడ్స్ తయారు చేసేందుకు యాపిల్‌కు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా యాపిల్ తన లేటెస్ట్ మొబైల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రోలను భారత్ మాన్యుఫ్యాక్చర్ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పుడు ఎయిర్ పాడ్స్, హెడ్‌ఫోన్స్‌ను తయారీని కూడా భారత్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే త్వరలోనే యాపిత్ తన ప్రొడక్ట్స్‌లో 80 శాతం భారత్‌తోనే తయారవుతాయని విశ్లేషకులు తెలుపుతున్నారు. మరి దీనిపై యాపిల్ సంస్థ త్వరలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Similar News