ఫిబ్రవరి 4 నుంచి బీజేపీ నిరసన యాత్ర

దిశ, ఏపీ బ్యూరో : రాష్ర్టంలో ఆలయాల కూల్చివేతకు నిరసనగా ఫిబ్రవరి 4న కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు నిరసన యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. విశాఖలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎక్కడైతే దేవాలయాలకు నష్టం జరిగిందో వాటన్నింటినీ కలుపుతూ యాత్ర సాగుతుందని చెప్పారు. పిఠాపురం, అంతర్వేది, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలంలో అన్యమత ప్రాబల్యం వంటి ఘటనలపై జనజాగృతి కలిగిస్తామని వెల్లడించారు. హిందుత్వానికి జరుగుతున్న విఘాతంపై పోరాడతామని స్పష్టం చేశారు. […]

Update: 2021-01-17 10:26 GMT

దిశ, ఏపీ బ్యూరో : రాష్ర్టంలో ఆలయాల కూల్చివేతకు నిరసనగా ఫిబ్రవరి 4న కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు నిరసన యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. విశాఖలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎక్కడైతే దేవాలయాలకు నష్టం జరిగిందో వాటన్నింటినీ కలుపుతూ యాత్ర సాగుతుందని చెప్పారు. పిఠాపురం, అంతర్వేది, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలంలో అన్యమత ప్రాబల్యం వంటి ఘటనలపై జనజాగృతి కలిగిస్తామని వెల్లడించారు. హిందుత్వానికి జరుగుతున్న విఘాతంపై పోరాడతామని స్పష్టం చేశారు. యాత్ర ప్రజల హృదయాల్లోకి వెళ్లే వరకూ చేస్తామన్నారు. వారం పాటు యాత్ర సాగుతుందని చెప్పారు. దేవాలయాలు నిర్మించే పార్టీని కూల్చే పార్టీగా డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. ఈనెల 20లోపు డీజీపీ క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

 

Tags:    

Similar News