పిఠాపురంలో ఎన్నికల వేళ కలకలం.. రూ. 17 కోట్ల వెండి, బంగారం పట్టివేత

దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికల హడావిడి నడుస్తున్నప్పటికి అందరి చూపు మాత్రం పిఠాపురం వైపే ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Update: 2024-05-04 03:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికల హడావిడి నడుస్తున్నప్పటికి అందరి చూపు మాత్రం పిఠాపురం వైపే ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ నియోజకవర్గం నుంచి, టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నానని ప్రకటించినప్పటి నుంచి.. పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో సెలబ్రీటిలు పవన్ గెలుపు కోసం నిత్యం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గం లో డబ్బు ప్రభావం అధికంగా ఉండబోతుంది భావించిన ఎన్నికల అధికారులు, పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే.. పిఠాపురంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ మినీ ట్రక్కు‌లో రూ. 17 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులను అధికారులు గుర్తించారు. వాటికి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి కాకినాడలోని జిల్లా ఖజానాకు తరలించినట్లు తెలిపారు. కాగా వెండి, బంగారం తో పట్టుబడిన వాహనం.. వైజాగ్ నుండి కాకినాడ వస్తున్నట్లు తెలుస్తుండగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read More..

AP Politics: సెంటిమెంట్‌ను చెరిపేస్తారా..? అక్కడ హ్యాట్రిక్ కొడతారా..? 

Similar News