16 రోజులుగా సమ్మె… పట్టించుకోని యాజమాన్యం

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది గ్రామ ఆశా కో కార్మికుల సమ్మె ప్రారంభించి నేటికి 16 రోజులు పూర్తయింది. ఈ నిరసనకు మద్దతుగా కంది గ్రామానికి చెందిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. ఆశా కో యాజమాన్యంపై మండిపడ్డారు. కార్మికుల సమ్మెను పట్టించుకోకుండా యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకోని కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఇలాగే మొండి వైఖరిని […]

Update: 2020-08-05 04:31 GMT

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది గ్రామ ఆశా కో కార్మికుల సమ్మె ప్రారంభించి నేటికి 16 రోజులు పూర్తయింది. ఈ నిరసనకు మద్దతుగా కంది గ్రామానికి చెందిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. ఆశా కో యాజమాన్యంపై మండిపడ్డారు.

కార్మికుల సమ్మెను పట్టించుకోకుండా యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకోని కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఇలాగే మొండి వైఖరిని చూపిస్తే తగిన గుణపాఠం చెబుతామని, ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News