తెలంగాణలో మరో సంచలనం.. ఆ పార్టీకే మెజార్టీ ఎంపీ సీట్లు..!

ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జోరు నడుస్తోంది.

Update: 2024-04-29 07:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జోరు నడుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్ది ప్రచారాల జోరు మరింతగా పెంచాయి. ఎంపీ అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తూ జనాల్ని మచ్చిక చేసుకుంటునే.. మరోవైపు ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ సారి మా పార్టీనే అధికారంలోకి వస్తుందని ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకోవడానికి న్యూస్ 24 ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది.

న్యూస్ 24 ఛానల్ చేసిన ఈ సర్వేలో సంచలన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. మెజార్టీ సర్వే ఫలితాలకు పూర్తి భిన్నంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు దక్కించుకుంటుదని న్యూస్ 24 ఛానల్ సర్వే ఫలితాలు వెల్లడించింది. బీఆర్ఎస్ 8 స్థానాలు దక్కించుకుంటుందని పేర్కొన్న సర్వే సంస్థ.. అధికార కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకే పరిమితం అవుతోందని తెలిపింది. బీజేపీ 6 సీట్లు, ఎంఐఎం ఒక చోట విజయం సాధిస్తాయని వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని ఈ సంస్థ ముందే చెప్పడం గమనార్హం.

Tags:    

Similar News