కండక్టర్ కుటుంబాన్ని ఆదుకుంటాం: ఆర్టీసీ ఎండీ తిరుమల రావు

దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లా రాజంపేటలో శుక్రవారం వరదలో ఆర్టీసీ బస్సు నీట మునిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బస్సులో చనిపోయిన కండక్టర్‌ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ప్రకటించారు. ఆ ఘటనలో మరో ఇద్దరు ప్రయాణికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ తిరుమలరావు కడప జిల్లాలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కడప బస్టాండ్‌, గ్యారేజ్‌ను పరిశీలించారు. […]

Update: 2021-11-20 05:42 GMT

దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లా రాజంపేటలో శుక్రవారం వరదలో ఆర్టీసీ బస్సు నీట మునిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బస్సులో చనిపోయిన కండక్టర్‌ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ప్రకటించారు. ఆ ఘటనలో మరో ఇద్దరు ప్రయాణికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ తిరుమలరావు కడప జిల్లాలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కడప బస్టాండ్‌, గ్యారేజ్‌ను పరిశీలించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,800 ఆర్టీసీ సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు. కడప, రాజంపేట మీదుగా తిరుపతికి సర్వీసులు రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. కడప ఆర్టీసీ గ్యారేజ్‌కు రూ.10 కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు.

epaper – 4:30 PM AP EDITION (20-11-21) చదవండి

Tags:    

Similar News