గ్రామ సచివాలయాల్లో సర్టిఫికెట్ల జారీ నిలిపివేత..కారణం ఇదే?

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏపీలో ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే.

Update: 2024-03-20 11:34 GMT

దిశ ప్రతినిధి,విజయవాడ: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏపీలో ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సర్టిఫికెట్ల పై సీఎం జగన్ ఫోటో ఉండడంతో ఈ నిర్ణయం ఈసీ ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయాలు మీసేవ కేంద్రాలలో వివిధ సర్టిఫికెట్ల జారిని నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.పలు ధ్రువపత్రాల పై సీఎం జగన్ ఫోటో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.సీఎం ఫోటో లేని కొత్త స్టేషనరీ వచ్చేవరకు ఎలాంటి సర్టిఫికెట్లు జారీ చేయవద్దని స్పష్టం చేశారు.ఎన్నికల కోడ్ కారణంగా కలెక్టర్లతో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం కూడా రద్దయింది.

Read More..

ఏపీలో వాలంటీర్లపై భారీగా ఫిర్యాదులు.. ఈసీ సంచలన నిర్ణయం  

Similar News